కాజీపేట టౌన్‌లో ప్యాసింజర్ రైలు హాల్టింగ్ పునరుద్ధరణ

WGL: కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌లో భద్రాచలం రోడ్-బల్లార్షా సింగరేణి ప్యాసింజర్ రైలుకు హాల్టింగ్ పునఃప్రారంభించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఇంజినీరింగ్ బ్లాక్ కారణంగా గతంలో హాల్టింగ్ ఎత్తివేశారు. రైలు నం. 17033 ఉదయం 9:08 గం., రైలు నం. 17034 మధ్యాహ్నం 3:25 గం.లకు కాజీపేట టౌన్‌కు చేరుతుందని తెలిపారు.