ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

కర్నూలు పట్టణంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించి, తెలంగాణలో విక్రయిస్తున్న గద్వాలకు చెందిన జయంత్ అనే నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 32 వాహనాలు, రూ. 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.