నాచారంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం

HYD: నాచారం ఎర్రగుంటలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. నాచారం విలేజ్ నేతాజీ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త సోమ భావనగౌడ్ హాజరై గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తొస్తారని అన్నారు.