ఏడుపాయల ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యం
MDK: ఏడుపాయల ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొడుపాక గ్రామానికి చెందిన సులోచన (35) కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, చెలిమకుంట ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి సోదరుడు దేవయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.