మూడు పాన్ షాపులకు జరిమానాలు

VZM: ఈగల్ ఐజి రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళవారం గజపతినగరం సీఐ రమణ, ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు సిబ్బంది పాఠశాల కళాశాల దగ్గరలో గల పాన్ షాప్‌లను తనిఖీ చేశారు. సిగరెట్ల అమ్మకాలను గుర్తించి కోప్తా యాక్ట్ కింద జరిమానా విధించారు. విద్యార్థులు సిగరెట్లు పొగాకు ఉత్పత్తులకు బానిసలు అవుతారని చర్యలు తీసుకున్నామన్నారు.