నర్సరీలను పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్
NGKL: బల్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ నర్సరీలను టెక్నికల్ అసిస్టెంట్ మహేందర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీరు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ లక్ష్యం మేరకు మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.