అజహరుద్దీన్‌కు ఎల్లారెడ్డి MLA అభినందనలు

అజహరుద్దీన్‌కు ఎల్లారెడ్డి MLA అభినందనలు

KMR: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శుక్రవారం కలిసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. అజహరుద్దీన్ క్రీడా రంగంలోనే కాకుండా ప్రజాసేవలోనూ విశేష అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు.