ఉట్పల్లిలో అంబరాన్నంటిన హొలీ సంబరాలు

ఉట్పల్లిలో అంబరాన్నంటిన హొలీ సంబరాలు

NZB: బోధన్ మండలం ఉట్పల్లిలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం అంబరాన్నంటాయి. ఉదయం నుంచే గ్రామస్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనంద కేరింతల మధ్య పండుగను జరుపుకున్నారు. సర్పంచి అందరికీ రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.