ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే చర్యలు : ACP

NTR: మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ఏసీపీ దామోదర్ మెడికల్ షాప్ యజమానులను హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అమ్మకాలు ఉంటే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. NRX ఔషధాల అమ్మకాలపై కఠిన నియమాలు పాటించాలని తెలిపారు.