కీలక బిల్లుకు కేబినెట్ ఆమోదం

కీలక బిల్లుకు కేబినెట్ ఆమోదం

అసోం కేబినెట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. బహు భార్యత్వ నిషేధిత బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఈ బిల్లును ఈ నెల 25న అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. దీని ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తారు. ఈ బిల్లులో ఎస్టీలకు, రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.