OTTలోకి వచ్చేస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'సూత్రవాక్యం'. మలయాళంలో రిలీజైన ఈ సినిమా తెలుగులో రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక యుజియన్ జోస్ చిరమ్మెల్ తెరకెక్కించిన ఈ సినిమాలో విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషించారు.