కొక్కరాయపల్లి పర్యటించిన NLM టీం

కొక్కరాయపల్లి పర్యటించిన NLM టీం

KDP: చెన్నూరు మండలం కొక్కరాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం నేషనల్ లెవెల్ మానిటరింగ్ (NLM) టీం పర్యటించింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకంలో వేసిన CC రోడ్, ఫీల్డ్, ఫీడర్ కాలువల పూడిక తీత, పశువుల షెడ్డు నిర్మాణాలను, స్టాగర్డ్ ట్రెంచ్ల పనులను పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పథకం రిజిస్టర్, జాబ్ కార్డులను తనిఖీ చేశారు.