మెడికల్ కాలేజీల నిర్మాణంపై పేర్నినాని ఫైర్

మెడికల్ కాలేజీల నిర్మాణంపై పేర్నినాని ఫైర్

AP: సీఎం చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా నిర్మించారా? అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు. 'రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను జగన్ తీసుకొచ్చారు. 7 కాలేజీల నిర్మాణం పూర్తయింది. మరో 10 నిర్మాణంలో ఉన్నాయి. పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు మెడికల్ కాలేజీలను తన బ్రోకర్లకు అప్పనంగా కట్టబెట్టారు' అని ఆరోపించారు.