సైన్యం చేతిలోకి మరో దేశం

సైన్యం చేతిలోకి మరో దేశం

ఆఫ్రికా దేశమైన గినియా బిస్సావు సైన్యం చేతిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణను తీసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తునట్లు తెలిపింది. అంతేకాకుండా దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. 1974లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం నాలుగు సార్లు తిరుగుబాట్లను ఎదుర్కొంది.