యూరియా కోసం బారులు తీరిన రైతులు
SKLM: సోమవారం మండల కేంద్రమైన ఎల్ ఎన్ పేటలోని మన గ్రోమర్ దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. అరకొర ఎరువు వచ్చిందని సమాచారం తెలుసుకున్న రైతులు దొరుకుతుందో లేదో అనే భయాందోళనతో మండుటెండలో భారీగా క్యూలో వేచి వున్నారు. అయితే, అందరికీ యూరియా అందజేస్తామని ఆందోళన వద్దని ఏవో సింహాచలం తెలిపారు.