మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

GNTR: పొన్నూరు పట్టణంలోని వెంకటేశ్వర కళాశాలలో మంగళవారం ఎక్సైజ్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం, అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిడుబ్రోలు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వలన విద్యార్థుల భవిష్యత్తు తప్పుదోవ పడుతుందని చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి స్నేహాన్ని కోరుకోవాలని సూచించారు.