మీనాక్షి నగర్‌లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే

మీనాక్షి నగర్‌లో పర్యటించిన ఉప్పల్ ఎమ్మెల్యే

MDCL: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్ పరిధిలోని మీనాక్షి నగర్‌ను ఈరోజు సందర్శించారు. అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను కాలనీవాసులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సమస్య దృష్టికి రాగా, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.