'గౌడ జన హక్కుల సాధన కోసం పోరాడాలి'
NRML: మోకు దెబ్బ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్స గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్మల్ పట్టణంలో జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా కనక గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌడ జన హక్కుల సాధన కోసం నూతన కమిటీ పని చేయాలని పిలుపునిచ్చారు.