డ్రైవర్, క్లీనర్ గొడవ.. స్కూల్ బస్సుకు నిప్పు
AP: డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ జరిగి స్కూల్ బస్సుకు నిప్పు పెట్టిన ఘటన ప్రకాశం(D) అర్థవీడు(M) పాపినేనిపల్లిలో జరిగింది. స్కూల్ పిల్లలను తీసుకువచ్చేందుకు బయలుదేరుతుండగా డ్రైవర్, క్లీనర్ గొడవపడ్డారు. ఈ క్రమంలో క్లీనర్ ఆగ్రహంతో పెట్రోల్ పోసి బస్సుకు నిప్పంటించాడు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.