'అంగన్వాడీల బాధ్యతలు మార్చొద్దు'
MDK: రేగోడ్‌లో CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. CITU జిల్లా కార్యదర్శి బస్వరాజు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం MRO దత్తారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు మంజుల, తదితరులు పాల్గొన్నారు.