పీలేరులో 'బడి పిలుస్తోంది' కార్యక్రమం
అన్నమయ్య జిల్లా పీలేరులో 'బడి పిలుస్తోంది' కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రవేశాల కోసం ఉపాధ్యాయులు, పాఠాశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన ఉంటుందని పిల్లల తల్లిదండ్రులకు చెప్పారు.