శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట పాఠశాలలో విద్యార్థులకు 'శక్తి యాప్' ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ జావలి ఆదేశాలతో శక్తి టీం సభ్యులు శనివారం కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండి, ఆపదలో యాప్ ద్వారా వెంటనే పోలీస్ సాయం పొందవచ్చని వివరించారు.