‘చిన్నారుల సోషల్ మీడియా అకౌంట్స్‌కు ఆధార్ లింకు’

చిన్నారుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని హీరో సాయి దుర్గా తేజ్ అభిప్రాయపడ్డాడు. అభయం మాసూమ్ సమ్మిట్-25లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పిల్లలపై అశ్లీలత, అసభ్యతను తగ్గించేందుకు ఆధార్ లింక్ తప్పనిసరి చేయాలన్నారు. ఫలితంగా పిల్లలు, పేరెంట్స్‌లో భయం పెరుగుతుందని, సోషల్ మీడియా దుర్వినియోగం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.