రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
AKP: ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ రాయవరం నుంచి అదే మండలం అడ్డరోడ్డు బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు వెనకనుంచి వ్యాన్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకులను 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.