VIDEO: ఎమ్మెల్యే ఇంటిపై కోడి గుడ్లతో దాడి

VIDEO: ఎమ్మెల్యే ఇంటిపై కోడి గుడ్లతో దాడి

SRPT: బోడుప్పల్‌లోని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిని BJYM నాయకులు ముట్టడించి, కోడిగుడ్లతో దాడి చేశారు. ఎన్నికల సమయంలో దేవాలయాల్లో పొర్లుదండాలు పెట్టి, ఇప్పుడు హిందూ సమాజాన్ని అవమానించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.