అమరచింతకు నేడు రాజకీయ ప్రముఖుల రాక

WNP: అమరచింతలోని ఆంజనేయస్వామి ఆలయ పున: నిర్మాణానికి నేడు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, పాలమూరు ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే చిట్టెం, రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ హాజరవుతారని ఆలయ కమిటీ నిర్వాహకులు తాటికొండ రమేష్, వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.