VIDEO: 'రోడ్డు విస్తరణ పూర్తిచేస్తే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా'
RR: చేవెళ్ల ప్రమాదంపై BRS రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడారు. చేవెళ్ల రహదారి విస్తరణకు కోర్టు అడ్డంకులు అన్ని దాటుకొని భూసేకరణ చేసి ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా పని మొదలవ్వలేదన్నారు. ఎంతసేపు గత ప్రభుత్వంపై బురద చల్లే బదులు రెండేళ్లలో రోడ్డు విస్తరణ పూర్తిచేస్తే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా? అని ప్రశ్నించారు.