పెళ్లి వేడుకలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్
AP: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె పెళ్లి వేడుకకు మంత్రి లోకేష్, టీజీ CM రేవంత్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్బంగా లోకేష్ సరదా సంభాషణ వీడియో వైరల్ అవుతోంది. 'మహిళా రిజర్వేషన్ వస్తే ఎమ్మెల్యే కావాలి.. రెడీగా ఉండు' అంటూ ఎమ్మెల్యే కుమార్తెతో సరదాగా మాట్లాడారు. 'నా సీటుకే ఎసరు పెడుతున్నావా బాబు?' అంటూ ధూళిపాళ్ల రిప్లై ఇచ్చారు. వెంటనే సీఎం రేవంత్ సరదా కామెంట్ చేశారు.