టేకు తోటలు దగ్ధం
SKLM: కోటబొమ్మాళిలోని వంశధార విద్యాలయం పక్కన ఉన్న సుమారు 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు ఆదివారం దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది మోటార్ సాయంతో మంటలను ఆర్పారు. వీఆర్వో రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకొని దగ్ధమైన తోటలను పరిశీలించారు. మద్యం సేవించడానికి వచ్చే ఆకతాయిలు ఇది చేసి ఉండొచ్చని స్థానికులు అనుమమానిస్తున్నారు.