'గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి'

NRPT: ఉట్కూర్ మండలంలోని పెద్దపొర్ల గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.