గ్యాస్ గోదాముల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే
NLG: మిర్యాలగూడలో వంట గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనిఖీ చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి విక్రయాల తీరును పర్యవేక్షించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా స్టాక్ రికార్డులను స్వయంగా పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.