హసీనాపై కేసు.. తీర్పు వాయిదా
మాజీ ప్రధాని హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ICT) వేసిన కేసులో తీర్పు వాయిదా పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నమోదైన కేసుపై ఇరు వైపు వాదనలు విన్న కోర్టు తీర్పును నవంబర్ 17న ప్రకటించనున్నట్లు తెలిపింది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందస్తుగా దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించింది.