సర్వదర్శన టోకెన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఈవో

సర్వదర్శన టోకెన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఈవో

TPT: శ్రీవారిమెట్టు మార్గంలోని సర్వదర్శన టోకెన్ కేంద్రాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. ప్రతిరోజూ 3వేల నుంచి 5 వేల టోకెన్లు జారీ అవుతున్నాయని, రద్దీ వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది తెలిపారు. అయితే, ఆటో డ్రైవర్లు అధిక వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించి, శాశ్వత పరిష్కారం కోసం అదనపు ఉచిత బస్సు సేవల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.