ప్రభుత్వ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుంది: ఎమ్మెల్యే
JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ధరూర్ క్యాంపు కోదండ రామాలయం కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2026-27 పోటీలను శుక్రవారం ప్రారంభించారు. క్రీడలతో మానసిక స్థైర్యం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు కృష్ణ, సూర్యం, శ్రీనివాస్, పాల్గొన్నారు.