ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో డ్రోన్స్ నిషేధం
AP: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా విశాఖ పోలీస్ భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా డ్రోన్‌ల వినియోగంపై కఠిన నిబంధనలు విధించారు. ఈ నిషేధం ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. ఈ మేరకు 'నో డ్రోన్ జోన్' అంటూ వార్నింగ్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.