తెప్పోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం
TPT: నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు అయిన మంగళవారం రాత్రి జరిగిన తెప్పోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని స్వామి అమ్మవార్లను, దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే ఆదిమూలంను ఆలయ మర్యాదలతో సత్కరించారు. భక్తులు భారీగా తరలివచ్చి తెప్పోత్సవాన్ని తిలకించారు.