స్వామివారిని దర్శించుకున్న కమిషనర్

కృష్ణా: మోపిదేవి గ్రామంలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ సూపరిండెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేశారు.