తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా స్వర్ణ
WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎర్రబెల్లి స్వర్ణ గతంలో వరంగల్ నగర మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మహిళల సమస్యలపై బలమైన పోరాటం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తానని స్వర్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.