‘'రామాయణ' కోసం 10 వేల మంది పనిచేస్తున్నారు’
భారతీయ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న ‘రామాయణ’ కోసం రికార్డు స్థాయిలో పనులు జరుగుతున్నాయని నిర్మాత నమిత మల్హోత్రా తెలిపాడు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 మంది నిపుణులు అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడించాడు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నాడు.