వృద్ధురాలి నుంచి మూడు లక్షల నగదు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్టు

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఈనెల 2వ తేదీన ఎస్‌బీఐ బ్యాంకులో నందనం భారతమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ డబ్బులు మూడు లక్షలు డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న వృద్ధురాలి నుంచి డబ్బులు కాజేసిన బత్తిని విజయ్ కుమార్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి, మూడు లక్షలు నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసినట్లు ఏసీపీ నర్సయ్య వెల్లడించారు.