'అంకితభావంతో పని చేస్తేనే ప్రాజెక్టులు పూర్తి'
VSP: వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ సూచించారు. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్‌తో కలిసి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు.