ప్రథమ చికిత్సపై విద్యార్థులకు అవగాహన..!
KRNL: కోడుమూరు మోడల్ స్కూల్‌లో వైద్యాధికారి నాగరాజు ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై విద్యార్థులకు ఇవాళ అవగాహన కల్పించారు. రోగులకు అత్యవసర సమయంలో చికిత్స ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల ప్రస్తుతం వయస్సు,లింగ భేదంతో సంబంధం లేకుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఆరోగ్య సమస్యలపై పలు సూచనలు ఇచ్చారు.