ట్రాఫిక్ పోలీస్‌గా మాజీ మంత్రి
బీజేపీ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి సురేష్ కుమార్ బెంగళూరులో ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు చేపట్టిన 'ట్రాఫిక్ కాప్ ఫర్ ఎ డే' కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ విధులను నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాల్సిన ఆవశ్యకత గురించి వాహనదారులకు వివరించారు.