దారుణం.. భార్యను హతమార్చిన భర్త

దారుణం.. భార్యను హతమార్చిన భర్త

సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ (మొదటి విడత)లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.