VIDEO: "తండాల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడమే లక్ష్యం"
WGL: రాయపర్తి మండలంలోని తండాల్లో 2971 గృహాలకు ఉచిత విద్యుత్ మీటర్లు బిగించే పనులు జరుగుతున్నాయని డీఈ హర్జి జాటోత్ ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజన తండాల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడమే 'ధరిత్రి అబా-జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్' ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.