గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

CTR: కుప్పం పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాగా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హతమార్చి రైలు పట్టాలపై పడేశారా అనే వివరాలు రైల్వే పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.