మాచర్ల వరకు రైల్వే లైన్‌కు ఏర్పాట్లు
NLG: నల్గొండ నుంచి హాలియా మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న కల నెరవేరనుంది. గత బడ్జెట్‌లో కేంద్రం రూ.2 కోట్లు కేటాయించి, రెండుసార్లు సర్వే నిర్వహించినా పనులు ముందుకు సాగలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి, తమ నిరీక్షణకు ముగింపు పలకాలని వారు కోరుతున్నారు.