పెనుకొండలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సవిత
SS: పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరవాడ ప్రాంతంలో శనివారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు స్వయంగా అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నెల 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు పండుగలా జరుపుకుంటున్నారన్నారు.