పెంకి విజయ్ కుమార్‌కు ఉగాది పురస్కారం

పెంకి విజయ్ కుమార్‌కు ఉగాది పురస్కారం

W.G: కాళ్ల జడ్పీ హైస్కూల్‌లో తెలుగు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ పెంకి విజయ్ కుమార్‌కు ఉగాది పురస్కారం లభించింది. భీమవరంలో గురువారం కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. పలువురు విజయ్ కుమార్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఉగాది పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.