BREAKING: కుప్పకూలిన హెలికాప్టర్
రష్యాలో హెలికాప్టర్ కుప్పకూలింది. తోక భాగం విరిగి పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.